రవితేజ, మనోజ్, విశ్వక్ సేన్‌... ఏమి కాంబినేషన్‌ గురూ?

మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత సినిమాను కూడా అప్పుడే లైన్లో పెట్టేసిన్నట్లు తెలుస్తోంది. దానిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ నటించబోతున్నారట! చాలా ఏళ్ళ తర్వాత ఇటీవలే మళ్ళీ సినిమాలు మొదలుపెడుతున్న మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్నారట! 

కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డు అందుకొన్న సందీప్ రాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నారట! ఇటీవల విడుదల సూపర్ హిట్ అయిన బేబీ సినిమా నిర్మాత ఎస్‌కెఎన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారట! 

అసలు రవితేజ వంటి ఒక్క మాస్ హీరో ఉంటేనే సినిమా అదిరిపోతుంది. అలాంటిది ముగ్గురు మాస్ హీరోల కాంబినేషన్‌లో సినిమా అంటే మరి చెప్పక్కరలేదు. పైగా సూపర్ హిట్ అందించిన దర్శక నిర్మాతలు ఈ సినిమా తీస్తున్నారంటే ఈ సినిమా రేంజ్ ఏస్థాయిలో ఉంటుందో?చూడాల్సిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రవితేజ నటిచిన టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్‌ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రవితేజకు హీరోయిన్లుగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్‌ దాచారం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

వంశీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: ఆర్‌ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందించారు. 

దీనితో పాటు రవితేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుంది.