మా ఉస్తాద్ వచ్చేశాడు... మొదలుపెట్టేశాడు!

పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని దర్శకుడు హరీష్ శంకర్‌, ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ, ‘ఉస్తాద్ ఈజ్ బ్యాక్‌ ఇన్‌ యాక్షన్’ అంటూ ఓ పోస్టర్‌ కూడా పెట్టారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నామని దర్శకుడు హరీష్ శంకర్‌ తెలిపారు. 

 కూలింగ్ గ్లాసస్ పెట్టుకొని ఓ చేతిలో తుపాకీ పట్టుకొని స్టయిల్‌గా కూర్చోన్న పవన్‌ కళ్యాణ్‌ని చూస్తే అభిమానులు సంతోషంతో పొంగిపోవడం ఖాయం. ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్‌, హరిహర వీరమల్లు రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ కోసం బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి షూటింగ్‌కి వచ్చిన్నట్లు తెలుస్తోంది. కనుక అభిమానులకు ఇంతకంటే గొప్ప శుబావార్త ఏముంటుంది? షూటింగ్‌ ఆలస్యమై ఉండవచ్చేమో కానీ ఒకసారి పవన్‌ కళ్యాణ్‌ సెట్స్‌లోకి అడుగుపెడితే ఇక శరవేగంగా సాగుతుంది. 

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌తో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశోతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, నాగ మహేష్, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కౌశిక్ మెహతా తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ  సినిమాకు దేవిశ్రీ ప్రసాద్: సంగీతం, ఆయనంకా బోస్: సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్‌: ఆనంద సాయి చేస్తున్నారు.