రోజా... ఆవిడెవరు? కంగన ప్రశ్న

అలనాటి అందాల నటి, ప్రస్తుత ఏపీ పర్యాటకమంత్రి రోజా గురించి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. ఆమె చేసిన సినిమాల ద్వారా అలాగే ఇప్పుడు ఏపీలో రాజకీయాల ద్వారా కూడా చాలా పాపులర్. అటువంటి రోజా ఎవరో తనకు తెలియదని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ అన్నారు. 

ఆమె నటించిన చంద్రముఖి-2 సినిమా ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఆ సినిమాని ప్రమోషన్స్‌లో ఆమె తనకు దేశభక్తి ఎక్కువని ఏదో ఓరోజు రాజకీయాలలో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకొంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా విలేఖరులు రోజా ప్రస్తావన తెచ్చి సినిమాలు వదులుకొని రాజకీయాలలో రావాలని పవన్‌ కళ్యాణ్‌కు సూచించారని, మీరు కూడా రాజకీయాల కోసం సినిమాలు వదులుకొంటారా? అని ప్రశ్నించారు. 

అప్పుడు ఆమె “రోజానా... ఆమె ఎవరు?ఆ పేరుగలవరెవరూ నాకు తెలీదు. తెలియనివారు వేరెవరి గురించో ఏదో మాట్లాడితే దానికి నేను ఎలా బదులివ్వగలను?” అని ఎదురు ప్రశ్నించడంతో విలేఖరులు కూడా ఆశ్చర్యపోయారు. కంగనా రనౌత్‌కు నిజంగానే రోజా ఎవరో తెలియదా లేక రోజా తీరుని వ్యతిరేకిస్తున్నవారిలో ఆమె కూడా ఒకరా? ఇంతకీ కంగనా సమాధానంపై రోజా ఎలా స్పందిస్తారో?