మహేష్ టైటిల్.. భరత్ అను నేను..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా వచ్చే జనవరిలో మొదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ తో ఆడియెన్స్ ను అలరించే రచయిత దర్శకుడు కొరటాల శివ మహేష్ తో ఇప్పటికే శ్రీమంతుడు సినిమా తీసి హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. నిన్ను నువ్వు ప్రేమిస్తే ఇతరులు కూడా నిన్ను ప్రేమిస్తారు గౌరవిస్తారు అన్న కథాంశంతో సినిమా కథ ఉంటుందని అంటున్నారు. 

ఇక ఈ సినిమాకు టైటిల్ గా భరత్ అను నేను అని పెట్టబోతున్నారట. మహేష్ సినిమా టైటిల్ పై ఫ్యాన్స్ ఎదురుచూపులు ఉంటాయి. ఇప్పటికి మహేష్ మురుగదాస్ సినిమా పై టైటిల్ క్లారిటీ రాలేదు. అయితే ఈ క్రమంలో భరత్ అను నేను టైటిల్ కూడా రూమర్ అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ అదే టైటిల్ అయినా కూడా సూపర్ అనేస్తున్నారు ఫ్యాన్స్. కరెక్ట్ సినిమా బడితే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన మహేష్ మురుగదాస్ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో బాక్సాఫీస్ మీద దాడికి దిగుతున్నాడు. మరి మహేష్ చేసే ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.