ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయన్... మూడు గంటల్లో 4 లక్షల లైక్స్!

ప్రముఖ నటి నయనతార తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి, మొట్టమొదటిసారిగా తన ఇద్దరు కవల పిల్లలని అభిమానులకు చూపారు. రజనీకాంత్‌ తాజా చిత్రం జైలర్ సినిమాలో హుకుం పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ఆమె ఇద్దరు పిల్లలని ఎత్తుకొని కెమెరాకు ఫోజ్ ఇచ్చారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేసిన గంటలోపే లక్ష మంది ఫాలోకాగా, ఆమె పోస్ట్ చేసిన ఆ రీల్‌కు మూడు గంటలలోనే 4.52 లక్షల మంది లైక్ చేయగా, ఏడు లక్షల మంది చూశారంటే నయనతార రేంజ్ నేటికీ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. 

నయనతార, బాలీవుడ్‌ హీరో షారూక్ ఖాన్‌తో చేసిన తాజా చిత్రం జవాన్ ట్రైలర్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకొన్నారు. నా అభిమాన హీరోతో నేను చేసిన తొలి హిందీ చిత్రం ఇది. దీని వెనుక ఎంతో కష్టం, ప్రేమ ఉన్నాయి. దీనిని మీరందరూ ఆదర్శిస్తారని ఆశిస్తున్నాను,” అని నయనతార వ్రాశారు.