చిచ్చా వచ్చిండు... గణేశ్ ఎంథమ్ సాంగ్‌ ప్రమో

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా వస్తున్న భగవంత్ కేసరి (సబ్ టైటిల్ ‘ఐ డోంట్ కేర్’) సినిమా నుంచి చిచ్చా వచ్చిండు... అంటూ సాగే గణేశ్ ఏంథమ్ సాంగ్‌ ప్రమో విడుదలైంది. పూర్తి పాట రేపు అంటే సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదలచేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాని తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. 

సెప్టెంబర్‌ 19నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అట్టహాసంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. సరిగా వాటికి ముందు గణేశ్ ఏంథమ్ పేరుతో ‘గణపతి బప్ప మోరియా...’ అంటూ హుషారుగా సాగే పాటను రిలీజ్‌ చేస్తుండటంతో ఈసారి గణేశ్ మందపాలలో ఈ పాట మారుమ్రోగబోతోంది. 

ఈ సినిమా కధ తెలంగాణలో జరుగుతుంది కనుక నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టైటిల్‌-పోస్టర్‌ వగైరా అన్నిటిలో కూడా తెలంగాణ యాసలోనే హింట్స్ ఇస్తున్నారు. 

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా పండుగకి ముందు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా:  అందిస్తున్నారు.