స్కంద నుంచి లిరికల్ సాంగ్‌... డుమ్మరే డుమ్మా

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జోడీగా వస్తున్న‘స్కంధ’ సినిమాలోని డుమ్మారే డుమ్మా లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని వ్రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా అర్మాన్‌ మాలిక్, అయ్యన్ ప్రణతి హుషారుగా ఆలపించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: ధమన్, కెమెరా: సంతోష్ డేటకే, స్టంట్స్: స్టంట్ శివ, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్. 

ఇది పక్కా మాస్ మసాలా సినిమా అయినప్పటికీ దీనిని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.    

ఈ సినిమాను శ్రీనివాస్ సిల్వర్‌ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 15న స్కంద ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.