
టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు జీవిత కధ ఆధారంగా అదే పేరుతో రవితేజ, నుపూర్ సనన్ జంటగా చేస్తున్న సినిమాఅక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఆ సినిమాలో నుపూర్ సనన్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. రైలు కిటికీలో నుంచి బయటకు చూస్తున్న ఫోటోను ఆమె సోదరి కృతి సనన్ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ, “నా చెల్లెలు నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ పోస్టర్ విడుదల చేయడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్ దాచారం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత రేణు దేశాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీన టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది. ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, కెమెరా: ఆర్ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.