చిరంజీవి 157వ సినిమా సోషియో ఫాంటసీ?

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఆయన 157వ చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాకు మల్లాది వశిష్ట దర్శకత్వం వహించబోతున్నారని తెలియజేసింది. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఓ చక్రంలో నక్షత్రం మద్యలో త్రిశూలం, నక్షత్రం ఐదు కోణాలలో పంచభూతాలైన భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలిని సూచిస్తున్నట్లు చూపారు. ఆ చక్రం వెనుక ఓ చెట్టు, దాని వెనుక కొండలు, సముద్రం, మేఘాలను చూపారు. 

పోస్టర్‌ను క్యాప్షన్ “మెగా మాస్ బియాండ్ యూనివర్స్” అని పెట్టారు. దీనిని బట్టి చిరంజీవి 157వ సినిమా సోషియో ఫ్యాంటసీ అని అర్దమవుతోంది. 

దర్శకుడు వశిష్ట బింబిసార సినిమాలో సోషియో ఫ్యాంటసీ కధాంశాన్ని బాగానే హ్యాండిల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు కనుక చిరంజీవితో చేయబోతున్న ఈ సినిమాతో సూపర్ హిట్ అందిస్తారని ఆశించవచ్చు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. భోళాశంకర్‌ తర్వాత చిరంజీవి మరే సినిమా మొదలుపెట్టలేదు కనుక త్వరలోనే ఈ సోషియో ఫ్యాంటసీ సినిమాని మొదలుపెట్టవచ్చు.