
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జోడీగా తెరకెక్కిస్తున్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. అది సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణం నేపద్యంలో పూర్తి యాక్షన్ సినిమాని తీసి తెలుగు ప్రేక్షకులకు తెలుగులోనే మంచి హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతిని కలిగించబోతునట్లు ట్రైలర్ ద్వారా చూపాడు.
గాంధీవధారి అర్జున సినిమాలో నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నారాయణ్, రోషిణి ప్రకాష్, మనిష్ చౌదరి, అభినవ్ గోమత్, రవి రాంగోపాల్ వర్మ, కల్పలత, బేబీ వేద నటించారు.
ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు, సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: ముఖేష్, యాక్షన్: లాజ్లో (హంగేరీ), విజయ్ జూజీ (యూకే), ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: అవినాష్ కొల్ల అందించారు.