మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా పూర్తిచేస్తున్నారు. దీని తర్వాత వెంటనే ఉప్పెనతో హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమాని మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిన్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్నామనూరి దర్శకత్వంలో సినిమా చేయవలసి ఉండగా అనివార్య కారాణాల వలన దానిని పక్కన పెట్టేసి బుచ్చిబాబుతో సినిమాకి సిద్దం అవుతున్నారు.
అయితే చాలా రోజులుగా అటు గేమ్ ఛేంజర్ నుంచి కానీ బుచ్చిబాబు సినిమా గురించి గానీ ఏవీ అప్‌డేట్ రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు సినిమాలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబు సాన సుకుమార్ శిష్యుడు అనే విషయం తెలిసిందే. కనుక ఈ సినిమా తొలి ప్రకటనలో ‘సుకుమార్ రైటింగ్స్’ అని కూడా పేర్కొన్నారు. అంటే ఈ సినిమాకి సుకుమార్ కూడా తోడ్పాటు అందించబోతున్నట్లు భావించవచ్చు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ కొత్తగా ప్రారంభించిన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1 గా వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని దర్శకూడు బుచ్చిబాబు చెప్పారు.