
నిఖిల్ సిద్దార్ధ్ కార్తికేయ 1,2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అదే ఊపులో ‘స్పై’ యాక్షన్ సినిమా చేశాడు కానీ బోర్లాపడటంతో ప్రేక్షకులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కూడా చెప్పుకొన్నాడు. కానీ దాని కోసం చింతిస్తూ కూర్చోకుండా వెంటనే మరో కొత్త సినిమా ‘స్వయంభూ’ మొదలుపెట్టేసి దాని తొలి పోస్టర్ కూడా విడుదలచేసేశాడు.
దానిలో నిఖిల్ ఓ యోధుడి వేషంలో గుర్రంపై కూర్చొని మంటలు కక్కుతున్న డ్రాగన్‌పైకి బాణం సందిస్తున్నట్లు చూపారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ రాజపత్రాన్ని చూపారు. కనుక ఈ సినిమా కూడా పీరియాడికల్ అని పోస్టర్ చూస్తే అర్దమవుతుంది.
ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా సంయుక్త మేనన్ నటిస్తున్నట్లు తెలిపారు. స్వయంభూ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. టాగూర్ మధు సమర్పణలో తీస్తున్న ఈ సినిమాను పిక్సల్ స్టూడియో బ్యానర్‌పై భువన్, శ్రీకర్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభించిన్నట్లు పోస్టర్లో తెలియజేశారు.