
నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’లో మూడు విభిన్నమైన పాత్రలలో చేసి మెప్పించాడు కానీ సినిమా కమర్షియల్‌గా సక్సస్ కాలేదు. దాని తర్వాత నవీన్ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజంట్’ గా నటిస్తున్నాడు. భారత్-పాక్ రెండుదేశాలుగా విడిపోయినప్పటి కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కనుక నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెవిల్ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదల చేశారు.
కళ్యాణ్ రామ్ కెరీర్లో తొలిసారిగా చాలా బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషలలో ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కధాంశం యావత్ దేశ ప్రజలు కనెక్ట్ అవుతారు కనుక సినిమాను చక్కగా తీయగలిగితే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మరింత ఎదుగుగుతారు.
డెవిల్ సినిమాకు కధ: శ్రీకాంత్ విస్స, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: సౌందర్ రాజన్ అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.