
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ్ళ సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ కన్వెషన్ సెంటర్లో ఖుషీ సినిమా పాటల్తతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది. ఇవాళ్ళ సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఈ సినిమాకు సంగీతం సమకూర్చి కొన్ని పాటలను కూడా పాడిన సంగీత దర్శకుడు హెషమ్ అబ్దుల్ వాహబ్, ప్రముఖ గాయకులు సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరి చరణ్, చిన్మయి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
దూరప్రాంతాలలో ఉన్నవారు ఈ సంగీత కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకుగాను youtu.be/s-ba7cIophM లింక్ ఏర్పాటు చేసింది. యూట్యూబ్‌లో ఈ లింక్ అడ్రస్ కాపీ పేస్ట్ చేసి చూడవచ్చు.
ఖుషీ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడ్కర్, లక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: మురళి జి, సంగీతం: హషమ్ అబ్దుల్ వాహేబ్, కొరియోగ్రఫీ: దిల్‌రాజు సుందరం, బృంద, పోనీ వర్మ అందిస్తున్నారు.