సెప్టెంబర్‌ 7న మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్‌

మహేష్ బాపు దర్శకత్వంలో స్వీటీ అనుష్క, నవీన్ పోలిశెట్టి జోడీగా వస్తున్న మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆగస్ట్ 4న విడుదల కావలసి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో చివరి నిమిషంలో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ పనులన్నీ ముగించుకొని సెప్టెంబర్‌ 7వ తేదీన కృష్ణాష్టమి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దీంతోపాటు నవీన్ పోలిశెట్టి స్టైల్లో చిన్న వీడియో స్కిట్ కూడా రిలీజ్‌ చేశారు. అది కూడా అద్భుతంగా ఉంది. 

లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేసే హీరోయిన్‌ అనుష్కతో హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్‌గా కాలక్షేపం చేస్తూండే నవీన్ పోలిశెట్టి ఎలా కనెక్ట్ అయ్యారు? వారిద్దరి మద్య ఏవిదంగా ప్రేమ చిగురించింది... చివరికి ఏం జరిగిందనేది ఈ సినిమా కధ. 

ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం పి. మహేష్ బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

నవీన్ పోలిశెట్టి కెరీర్‌లో తొలిసారిగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాను వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు.