ప్రిన్స్ వరుణ్ తేజ్ శక్తి, మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ జంటగా ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో చేస్తున్న సినిమా పేరు ఆపరేషన్ వాలంటైన్ అని ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ భారత వాయుసేనలో ఫైటర్ ప్లేన్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఇదివరకు పోస్టర్‌లోనే “అవధులు లేని ధైర్యసాహసాలు, శౌర్యం పట్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబరాలు చేసుకోబోతుంది. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు సిద్ధంగా ఉండండి. త్వరలో టేకాఫ్‌కు సిద్ధం అవుతుంది” అంటూ ఈ విషయం చెప్పేశారు.
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ డిసెంబర్ 8వ తేదీన సినిమా విడుదల చేయబోతున్నట్లు వరుణ్ తేజ్ స్వయంగా తెలియజేస్తూ పెట్టిన తాజా పోస్టర్‌లో “భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనించబోతోంది” అంటూ క్యాప్షన్ పెట్టారు. కొన్ని యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ కధ వ్రాసుకొన్నట్లు దర్శకుడు ప్రతాప్ సింగ్ హడా తెలిపారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన మరో యాక్షన్ చిత్రం గాందీవధారి అర్జున ఈ నెల 25న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.