జిలేబీ ట్రైలర్‌... చాలా స్వీట్‌గా ఉంది

ఇటీవల యువతరం నటీనటులు, రచయితలు, దర్శకులు, సంగీత దర్శకులు టాలీవుడ్‌లోకి కొత్త కొత్త ఐడియాలతో దూసుకువచ్చేస్తున్నారు. వారిలో కొంతమంది ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతున్నారు కూడా. అటువంటి ఫ్రెష్ బ్యాచే జిలేబీ సినిమాను తెరకెక్కించింది. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో తెర కెక్కిస్తున్న ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, గెటప్ శ్రీను, అంకిత్, సన్నీ, బమ్చిక్ బబ్లూ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

బాయ్‌ ఫ్రెండ్ కోసం ఓ అబ్బాయిల హాస్టలోకి ప్రవేశించిన అమ్మాయి అక్కడే చిక్కుకుపోతే కామెడీ ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు. అయితే ఈ ఒక్క పాయింట్ పట్టుకొని దర్శకుడు సినిమా మొత్తం లాగించేయాలనుకొంటే స్క్రీన్ ప్లేతో సినిమాని పరుగులు పెట్టించినప్పుడే హిట్ అవుతుంది. 

ఈ సినిమా ఎస్ఆర్‌కె ఆర్ట్స్, అంజు అస్రాణి క్రియెషన్స్ బ్యానర్లపై రామకృష్ణ, అంజు అస్రాని కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం, సతీశ్ ముత్యాల కెమెరా, రాంగోపాల్ వర్మ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది.