
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జోడీగా చేస్తున్న ‘గాంఢీవధారి అర్జున’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. కనుక నిర్మాణ సంస్థ ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ని విడుదలచేసింది. ఈ ట్రైలర్ చూస్తే తెలుగు సినీ పరిశ్రమలో అంతర్జాతీయస్థాయిలో యాక్షన్ ఫిలిమ్స్ తీయగల మంచిసత్తా గల దర్శకుడు ప్రవీణ్ సత్తారు అని అర్దమవుతుంది. ట్రైలర్ సౌండ్ మ్యూట్ చేసి చూస్తే హాలీవుడ్ సినిమాయే అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. కనుక ఈ సినిమా ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోవచ్చు.
వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే తొలిసారిగా చాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అమెరికా, యూరోపియన్ దేశాలలో షూట్ చేశారు.
ఈ సినిమాలో నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నారాయణ్, రోషిణి ప్రకాష్, మనిష్ చౌదరి, అభినవ్ గోమత్, రవి రాంగోపాల్ వర్మ, కల్పలత, బేబీ వేద నటించారు.
ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు, సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: ముఖేష్, యాక్షన్: లాజ్లో (హంగేరీ), విజయ్ జూజీ (యూకే), ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: అవినాష్ కొల్ల అందించారు.