దుల్కర్ కింగ్ ఆఫ్ కోత ట్రైలర్‌ విడుదల

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళీ నటుడు సల్మాన్ దుల్కర్ తాజాగా ఓ గ్యాంగ్‌స్టర్‌గా ‘కింగ్ ఆఫ్ కోత’ అనే వెరైటీ టైటిల్‌తో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు పీడియాడికల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది కనుక ఇది కూడా ఆ ట్రెండ్‌నే ఫాలో అవుతూ 1980-90ల మద్య జరిగిన గ్యాంగ్‌స్టర్‌ గొడవల నేపధ్యంతో దర్శకుడు అభిలాష్ జోషి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్‌ విడుదల చేశారు.  

ఈ సినిమాలో దుల్కర్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు చేయగా ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్‌, గోకుల్ సురేశ్‌, షమ్మీ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

వేఫరెర్‌ ఫిలిమ్స్, జీ స్టూడియోస్‌ కలిసి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం: షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి అందించారు.