
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్ జంటగా నటిస్తున్న సలార్-1 సీజ్ ఫైర్ గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండటంతో సినిమా గురించి తెలుసుకొనేందుకు మీడియా ప్రతినిధులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
సలార్ సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక ఎవరైనా స్టోరీని లీక్ అయితే సినిమా చాలా నష్టపోతుందని కనుక నటీనటులు, యూనిట్లో పనిచేస్తున్న వారందరూ మీడియా ప్రతినిధులకు దూరంగా ఉండాలని దర్శకనిర్మాతలు హెచ్చరించారు. సలార్ ట్రైలర్ విడుదలయ్యేవరకు ఎవరూ మీడియా, వెబ్‌సైట్స్, యూట్యూబర్స్ ఎవరితో మాట్లాడరాదని, ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరాదని సూచించారు.
సలార్-1 షూటింగ్ పోర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
సలార్‌లో విలన్ రాజమన్నార్‌గా జగపతి బాబు, మరో విలన్‌గా పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈశ్వరీరావు, మధు గురుస్వామి, తమిళ నటి శ్రీయరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.
రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో హోంభోలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ సలార్‌ను పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.