హమ్మయ్యా ఎట్టకేలకు... పుష్ప-2 నుంచి చిన్న అప్‌డేట్

పుష్ప-2 సినిమా షూటింగ్‌ మొదలుపెట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఆ సినిమాకు సంబందించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదంటూ అల్లు అర్జున్‌ అభిమానులు సోషల్ మీడియాలో, బయట రోడ్ల మీద రచ్చరచ్చచేస్తున్నారు. 

ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాస్ ఫాసిల్  భన్వర్ సింగ్‌ షెకావత్‌గా నటిస్తుండటంతో కేరళలో ఆయన అభిమానులు కూడా ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ కావాలంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అభిమానుల ఒత్తిడి భరించలేక మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఇవాళ్ళ ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకొని ఓ పోస్టర్‌ విడుదల చేసింది. నున్నటి గుండు, కూలింగ్ గ్లాసస్ పెట్టుకొని ఓ చేత్తో సిగరెట్ పట్టుకొని కాల్చుతున్న పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. 

పుష్ప-1లో నటించిన ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు మరికొంతమంది నటీనటులు పుష్పా-2లో కూడా నటిస్తున్నారు. కొత్తగా జగపతిబాబు కూడా ఈ సినిమాలో చేస్తున్నారు. 

పుష్ప-2 సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.