
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమా సెప్టెంబర్ 1న ఖుషీ విడుదల కాబోతుండటంతో సినిమా ట్రైలర్ రెడీ అయ్యింది. రెండున్నర నిమిషాలు నిడివిగల ట్రైలర్ ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్లు విజయ్ దేవరకొండ స్వయంగా ట్వీట్ చేశారు. దాంతోపాటు సమంతతో ఓ పోస్టర్ కూడా పోస్ట్ చేశారు.
ఖుషీ సినిమా నుంచి ఇప్పటికే రెండు లిరికల్ వీడియో సాంగ్స్, టైటిల్ సాంగ్ కూడా విడుదల చేశారు. పాటలన్నీ చాలా మెలోడియస్‌గా ఉన్నాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో సిద్దమవుతున్న ఖుషీ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడ్కర్, లక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కెమెరా: మురళి జి, సంగీతం: హషమ్ అబ్దుల్ వాహేబ్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృంద, పోనీ వర్మ అందిస్తున్నారు.
విజయ్ దేవరకొండ చేసిన లైగర్, సమంత చేసిన శాకుంతలం సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇద్దరూ ఈ సినిమాపై చాలా ఆశలుపెట్టుకొన్నారు. మరి ఈ సినిమా వారికి మళ్ళీ బ్రేక్ ఇస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 1 వరకు ఎదురుచూడాల్సిందే.