బ్రో... మేకింగ్ వీడియో చూశావా?

మెగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరం తేజ్, కేతిక శర్మ తదితరులు నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదలై మంచి కలక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ‘శ్యామ్ బాబు’ పాత్రతో తనను అవమానించరంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేస్తున్న హడావుడితో బ్రోకి మంచి ఉచిత ప్రమోషన్ లభిస్తోంది. ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల కోసం నిన్న సాయంత్రం బ్రో మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సినిమా మేకింగ్ వీడియోలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. బ్రోలో హేమాహేమీలు ఉన్నందున ఈ మేకింగ్ వీడియో కూడా ఇంకా ఆసక్తికరంగా ఉంది.       

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/YuUsym-hsNI" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>