శర్వానంద్ ఇటీవలే పెళ్ళి చేసుకొని భార్య రక్షిత రెడ్డితో కలిసి హనీమూన్ వెళ్ళాడు. ఇంతలోనే ‘బేబీ ఆన్ బోర్డ్’ అని చెప్పడంతో అప్పుడే తండ్రి కాబోతున్నాడా?అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అది శర్వా చేయబోయే తదుపరి సినిమా టైటిల్ అట! శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు ‘బేబీ ఆన్ బోర్డ్’ టైటిల్ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శార్వకు జోడీగా కృతీశెట్టి నటించబోతోంది. ఈ సినిమాతో కొత్తగా పెళ్ళి అయిన శర్వానంద్, ఇంకా పెళ్ళికానీ కృతీశెట్టి ఓ పాపకు తల్లితండ్రులుగా నటించబోతున్నారు.
‘బేబీ ఆన్ బోర్డ్’ అంటే కారులో పసిపిల్లలు ఉన్నట్లు సూచిస్తున్నట్లు కనుక ఈ సినిమా కధ ‘కారు ప్రయాణం’లో సాగబోతున్నట్లు అర్దమవుతోంది. లండన్ నగరంలో ఈ సినిమా కధ సాగుతుంది. శ్రీరామ్ ఆదిత్య కధ, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం : అబ్దుల్ వహాబ్, కెమెరా: విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
శర్వానంద్ గత ఏడాది ‘ఒకే ఒక్క జీవితం’ సినిమా చేశాడు. కానీ అది అంత గొప్పగా ఆడలేదు. పెళ్ళి చేసుకొన్న తర్వాత చేస్తున్న ఈ మొదటి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.