ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో డేంజర్ పిల్ల... లిరికల్ వీడియో సాంగ్‌!

నితిన్, శ్రీలీల జోడీగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు ఆ సినిమాలో మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. డేంజర్ పిల్ల... అంటూ సాగే ఈ పాటని కృష్ణకాంత్ వ్రాయగా దానికి హారిస్ జయరాజ్ చక్కగా స్వరపరిచారు. అర్మాన్ మాలిక్, శామ్యూల్ నికోలస్ బృందం దానిని హుషారుగా ఆలపించారు. 

ఈ సినిమాలో రావు రమేష్, సంపత్, బ్రహ్మాజీ, సుధీర్ నాయర్, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, పవిత్రా లోకేష్, హరి తేజ, జగదీష్, హైపర్ ఆది నటిస్తున్నారు. 

శ్రేష్టా మూవీస్ బ్యానర్‌పై ఎం సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్: సంగీతం, ఆర్ధర్ ఏ విల్సన్, యువరాజ్, సాయిరాం: కెమెరా, ప్రవీణ్‌ పూడి: ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌ 23న విడుదల కాబోతోంది.