బ్రో సినిమాపై ఏపీ మంత్రి రాంబాబు రివ్యూ!

ఏపీలో జగన్ జగన్ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ నిప్పులు చెరుగుతుండటంతో ఏపీ మంత్రులందరూ కూడా ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తుంటారు. వారిలో సాగునీటిశాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా ఒకరు. ఆయన ఏటా సంక్రాంతి పండుగకు తన సత్తెనపల్లి నియోజకవర్గంలో బ్యాండ్ మేళం పెట్టుకొని మరీ రోడ్లపై సినిమా పాటలకు డాన్సులు చేస్తుంటారు. 

జగన్ ప్రభుత్వంలో కాస్త నోటి దురద ఎక్కువ ఉన్నవారిలో ఆయన కూడా ఒకరు. కనుక పవన్‌ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ గురించి తరచూ చాలా అవహేళన మాట్లాడుతుంటారు. 

కనుక పవన్‌ కళ్యాణ్‌ కూడా బ్రో సినిమాలో ‘శ్యామ్ బాబు’ పేరుతో ఆయన వంటి ఓ క్యారెక్టర్ (పృధ్వీ) పెట్టి ఆడేసుకొన్నారు. బ్రోలో తనపాత్ర గురించి పృధ్వీ ఏమన్నారంటే “నిత్యం బార్లలో మందుకొడుతూ అమ్మాయిల వెంటబడి తిరిగే ఓ పనికిమాలిన వ్యక్తిలా నటించాను. ఇదివరకు ఎవరూ నన్ను ఇంటర్వ్యూలు అడగలేదు కానీ ఇది చేసినప్పటి నుంచి మీడియా నా వెంటపడుతోంది,” అని చెప్పారు. అంటే మంత్రి అంబటి రాంబాబుని శ్యామ్ బాబు పాత్రతో ఎంతగా కించపరిచారో అర్దం చేసుకోవచ్చు.

అందుకే అంబటి రాంబాబు భగభగ రగిలిపోతున్నారు. నేను కూడా పవన్‌ కళ్యాణ్‌ మీద బయోపిక్ తీయబోతున్నానంటూ, తన పాండిత్యం అంతా ప్రదర్శిస్తూ ఓ అరడజను టైటిల్స్ చెప్పారు.  “బ్రోలో నన్ను కించపరచాలనే శ్యామ్ బాబు పాత్ర క్రియేట్ చేశారని నాకు తెలుసు. కానీ నావంటి పెద్దమనుషులను కించపరిస్తే అటువంటి సినిమాలు ఆడవు. ఫ్లాప్ అయిపోతాయి. బ్రో కూడా ఫ్లాప్ అయ్యిందని విన్నాను. బ్రో కలక్షన్స్‌ పడిపోవడంతో సినిమాలో శ్యామ్ బాబు క్యారక్టర్ గురించి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ హైప్ సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా బ్రోని ఆ దేవుడు కూడా కాపాడలేడు. 

ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ రోజుకి రెండు కోట్లు పారితోషికం తీసుకొన్నానని చెప్పాడు. కనీసం అదైనా తిరిగివస్తుందో రాదో అనుమానమే. వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఈవిదంగా సినిమాలు తీస్తే ఇకపై పవన్‌ కళ్యాణ్‌ సినిమాలేవీ ఆడవు. అన్నీ ఫ్లాప్ అయిపోవడం ఖాయం,” అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్‌ కళ్యాణ్‌కి శాపనార్ధాలు పెట్టారు.