చంద్రముఖి-2లో రాఘవ లారెన్స్ ఫస్ట్-లుక్‌

2005లో వచ్చిన రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా పి.వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి-2ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారన్స్ రాఘవ ఈ సినిమాలో ప్రధానపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

చంద్రముఖి-2లో రాజుగారి వేషధారణలో రాఘవ లారెన్స్ ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ని సోమవారం రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఇంకా రాధికా శరత్ కుమార్‌, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో నిర్మిస్తున్న చంద్రముఖి-2 సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి  ఏడాది సెప్టెంబర్‌లో వినాయక చవితి పండుగ రోజున విడుదల చేయబోతున్నారు.