శ్రీకాంత్ హీరోగా కోట బొమ్మాళి మోషన్ పోస్టర్‌

నటుడు శ్రీకాంత్ మళ్ళీ చాలారోజుల తర్వాత ‘కోట బొమ్మాళి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ ఈరోజు విడుదల చేశారు. అది చూస్తే ఇది పోలీసులు-రాజకీయనాయకుల మద్య జరిగే ఓ క్రైమ్ స్టోరీ అని అర్దమవుతోంది. కానీ మోషన్ పోస్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. 

“హత్య కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు... అంటూ ఓ పేపర్ క్లిప్పింగ్‌లో పారిపోతున్న ముగ్గురు పోలీసులను చూపిస్తూ పరారీలో కోట బొమ్మాళి పోలీసులు” అని కిందన వ్రాశారు.    

తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, కెమెరా: జగదీష్ చీకటి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: గాంధీ నడికుడికర్ చేస్తున్నారు.