గోదారోళ్లం మాటొకటే సాగదీస్తాం తేడాలొస్తే...

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్‌ 11వ సినిమా ఫస్ట్ గ్లింప్స్, టైటిల్‌ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ సినిమాకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని టైటిల్‌ ప్రకటించారు. ఫస్ట్‌ గ్లింప్స్‌తోనే విశ్వక్ సేన్‌ అదరగొట్టేశాడు. “అన్నా మేము గోదారోళ్లం మాటొకటే సాగదీస్తాం తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం...” అంటూ విశ్వక్ సేన్‌ వాయిస్ ఓవర్‌తో చూపిన ఫస్ట్‌ గ్లింప్స్‌  చాలా బాగుంది. 

ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంజలి కూడా ఈ సినిమాలో  ఓ ప్రధానపాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో గోపరాజు రమణ, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.    

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మాద్దాడి, స్టంట్స్: పృధ్వీ, ఆర్ట్: గాంధీ నడికుడికర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. ఈ సినిమా డిసంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/CNB-8RxWm1Q" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>