మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్, కేతిక శర్మలు ప్రధాన పాత్రలో సముద్రఖని దర్శకత్వంలో నిన్న విడుదలైన బ్రో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలక్షన్స్ కనకవర్షం కురుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పుడు వారికోసం ఈ సినిమాకు సంబందించి ఓ లిరికల్ వీడియో ర్యాప్ సాంగ్‌ని విడుదల చేశారు.
“ఎవ్రీ గాడ్ మ్యాన్ ప్లేస్... ఎవ్రీ వేర్ ఇన్ ద స్పేస్... దేర్ ఈజ్ నో డిస్ గ్రేస్...యూ వుడ్ సీమై ఫేస్...” అంటూ హుషారుగా సాగే ఆదిత్య అయ్యంగార్ వ్రాసి స్వయంగా పాడారు. ఈ పాటకు థమన్ చక్కటి మ్యూజిక్ అందించారు. బ్రోలో కొన్ని సన్నివేశాలను బిట్స్‌గా చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ర్యాప్ సాంగ్ వినిపించడం చాలా బాగుంది.
బ్రో సినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.