.jpg)
నాగశౌర్య, యుక్తి తరేజ, మురళీశర్మ, గోపరాజు రమణ ప్రధానపాత్రలలో చేసిన రంగబలి సినిమా జూలై 7న థియేటర్లలో విడుదలై అందరినీ ఆకట్టుకొంది. అప్పుడే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రంగబలి ప్రసారం కాబోతోంది.
పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఎస్ఎల్‌వి సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా కధమిటంటే...
రాజవరంలో అల్లరిచిల్లరగా తిరుగుతూ కాలక్షేపం చేసే హీరో శౌర్య (నాగశౌర్య) తండ్రి (గోపరాజు రమణ) ఒత్తిడితో వైజాగ్ వెళ్ళి అక్కడ ఓ మెడికల్ కాలేజీలో ఫార్మసీ కోర్సులో చేరుతాడు. అక్కడే హీరోయిన్ సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి (మురళీశర్మ) వారి ప్రేమకు ఓకే చెపుతాడు కానీ శౌర్య స్వస్థలం రాజవరం అని తెలుసుకొని వారి పెళ్ళికి నిరాకరిస్తాడు. ఇంతకీ రాజవరంలో ‘రంగబలి సెంటర్’కు వీరి పెళ్ళికి ఏమి సంబంధం?తర్వాత ఏమి జరిగిందనేది ఈ సినిమా కధ.