
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జోడీగా వస్తున్న భోళాశంకర్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ముందే చెప్పిన్నట్లు ఇది కూడా పక్కా కమర్షియల్ మూవీ అని ట్రైలర్లో మరోసారి ఖరారు చేశారు. ఆడపిల్లలను ఎత్తుకుపోయే ఓ విలన్గా గ్యాంగ్, వారిని పట్టుకోలేక తిప్పలుపడే పోలీసులు, కట్ చేస్తే మన భోళాశంకర్ ఎంట్రీ ఇచ్చి పంచ్ డైలాగ్స్ చెపుతూ విలన్ గ్యాంగులని ఉతికి ఆరేస్తుంటాడు. మద్యలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నతో పాటలు, డాన్సులు.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు (కీర్తి సురేశ్) పాత్ర బహుశః సెంటిమెంట్ కోసం పెట్టి ఉండవచ్చు. విలన్ గ్యాంగ్ ఆమెను ఎత్తుకుపోవడంతో భోళాశంకర్కు కోపం వచ్చేసి డాన్ డెన్లో ప్రవేశించి ఫినిష్ చేసేయడమే సినిమా క్లైమాక్స్ అని ట్రైలర్లో కనిపిస్తోంది. ఇవన్నీ ఈ సినిమాని గట్టెక్కిస్తాయో లేదో తెలీదు కానీ చిరంజీవి కామెడీతో దట్టించి ఉంటే అదే ఈ సినిమాను గట్టెకిస్తుంది.
ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, డైలాగ్స్: మామిడ్ల తిరుపతి, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, ఫోటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ అందిస్తున్నారు. భోళాశంకర్ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.