విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ అవుతారా?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషీ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకొంది. సెప్టెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను అమెరికాలో అట్టహాసంగా ప్రీలాంచ్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు శ్లోక సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

లైగర్ సినిమాతో విజయ్‌ దేవరకొండ ఎదురుదెబ్బ తినగా, శాకుంతలం సినిమాతో సమంత ఎదురుదెబ్బ తింది. కనుకే ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవడం చాలా అవసరం. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని ‘నా రోజా నువ్వే...’ ‘ఆరాధ్య...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. 

ఖుషీ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడేకర్, లక్ష్మి, శరణ్యా అయ్యంగార్, రోహిణి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: మురళి జి, సంగీతం: హషమ్ అబ్దుల్ వాహేబ్ అందిస్తున్నారు.