అవసరమైతేనే లిప్‌లాక్స్ అంటున్న అమ్మడు

నయనతార, కాజల్ అగర్వాల్, అనుష్కల బ్యాచ్ తర్వాత సమంత, పూజా హెగ్డే తదితరులు వచ్చారు. వారి పీరియడ్ కూడా అప్పుడే ముగిసినట్లుంది. ఇప్పుడు రష్మిక మందన, శ్రీలీల, మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిలో మీనాక్షి చౌదరి ప్రస్తుతం గుంటూరు కారంలో మహేష్ బాబుకి హీరోయిన్‌గా చేస్తోంది. 

ఇవికాక వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. మరికొన్ని సినిమాలకు కధలు వింటున్నానని చెప్పింది ఈ అమ్మడు. అవకాశాలు వస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతీ సినిమాకు ఒప్పేసుకొని గ్లామర్ డాల్‌గా మిగిలిపోవాలని అనుకోవడం లేదని మీనాక్షీ చౌదరి చెప్పింది. 

కధ నచ్చి అందులో ఎటువంటి అభ్యంతరకరమైన లేదా అశ్లీల సన్నివేశాలు లేవని నిర్ధారించుకొన్నాకే సినిమాలకు ఒకే చెపుతున్నానని చెప్పింది. ఒకవేళ గ్లామర్ షో చేయాలనుకొంటే ఈపాటికే చాలా సినిమాలు చేసి ఉండేదానినని చెప్పింది. 

ఇక సినిమాలలో హీరోలతో ‘లిప్‌లాక్స్’ చేయడం తనకు ఇష్టం లేదని కానీ కధకు అవసరమైతే ‘లిప్‌లాక్స్’కు అభ్యంతరం లేదని చెప్పింది. విభిన్నమైన పాత్రలు వస్తే వదులుకోనని మీనాక్షీ చౌదరి చెప్పింది. 

అయితే సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే హీరోయిన్లందరూ మొదట్లో ఇలాగే చెపుతుంటారు. కొందరైతే ఇలాంటి లిమిట్స్ ఏమీ పెట్టుకోకుండా మొహమాటపడకుండా నటించేస్తుంటారు. ఈ లెక్కన మీనాక్షి చౌదరి మొదటిరకం హీరోయిన్‌ అనుకోవాలి. అయితే కధకి అవసరమైతే ‘లిప్‌లాక్స్’కు అభ్యంతరం లేదని చెప్పేసింది కనుక దర్శకులకే ఆ ఛాయిస్ వదిలిపెట్టిన్నట్లు భావించవచ్చు. ఆ మాత్రం క్లూ ఇస్తే హీరోయిన్ల చేత లిప్‌లాక్స్ ఎలా పెట్టించాలో దర్శకులకు ఆమాత్రం తెలీదా?