ట్రైలర్‌ అదిరిపోయింది బ్రో... ఓ లుక్‌ వేస్కో

సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, సాయిధరం తేజ్ కలిసి చేస్తున్న బ్రో సినిమా ట్రైలర్‌ శనివారం సాయంత్రం విడుదలైంది. తమిళంలో ‘వినోదాయ సితం’ చాలా నీరసంగా సాగగా, బ్రోలో పవన్‌ కళ్యాణ్‌ మ్యాజిక్ సినిమాకు మంచి కిక్కు తెచ్చిందనే చెప్పాలి.

ట్రైలర్‌లో పవన్‌ కళ్యాణ్‌, సాయిధరం తేజ్ ఇద్దరూ ఇరగదేసేశారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ కాకుండా కాలచక్రం పాత్రకు మరొకరిని ఊహించుకోవడం కష్టమనిపిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ మ్యానరిజం, త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్ చూస్తే ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనిపిస్తుంది.

ట్రైలర్‌ ఎలా ఉందో తెలుసుకోవాలనుకోవడం తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడిగిన్నట్లుటుంది. కనుక అదేదో మీరే స్వయంగా చూసి డిసైడ్ చేసుకొంటే బాగుంటుంది.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో వస్తున్నాడు.