అమెజాన్ ప్రైమ్‌లోకి మను చరిత్ర వచ్చేసింది... చూశారా?

భరత్ పెదగాని దర్శకత్వంలో శివకందూరి, మేఘా ఆకాష్ జంటగా నటించిన మను చరిత్ర సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన రావడంతో కమర్షియల్‌గా సక్సస్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ సినిమా కోసం రెండు పాటలు వ్రాయడమే కాకుండా ఈ సినిమాలో నటించారు కూడా.

మను చరిత్రకు బహుశః అర్జున్ రెడ్డి సినిమా స్పూర్తిగా తీసుకొన్నట్లు అనిపిస్తుంది. హీరో కాలేజీ టాపర్. ఉన్నత విద్యలు అభ్యసించాల్సిన హీరో కొన్ని కారణాల వలన వరంగల్లో ఓ మామూలు కాలేజీలో చేరుతాడు. మద్యానికి అలవాటు పడి జీవితం పాడుచేసుకొంటూ అమ్మాయిలతో ప్రేమలో పడుతూ బ్రేకప్ చెపుతూ రోజులు దొర్లించేస్తుంటాడు. అతని తాగుడుకి కారణం ఏమిటి? జీవితం ఈవిదంగా సాగింది? అనేదే ఈ సినిమా కధ. ఇలాంటి సినిమాలు కూడా ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. అయితే దర్శకుడు తడబడటంతో ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఓసారి ఓటీటీలో చూడవచ్చు.