భోళాశంకర్‌ నుంచి మిల్కీబ్యూటీ సాంగ్‌...ఓకే!

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జోడీగా చేస్తున్న భోళాశంకర్‌ సినిమా నుంచి ఈరోజు మిల్కీ బ్యూటీ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటను మహతి స్వరసాగర్ స్వరపరచి స్వయంగా విజయ్ ప్రకాశ్, సంజనా కాలమంజేలతో కలిసి పాడారు.    

ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

 వాల్తేర్ వీరయ్యలాగ భోళాశంకర్‌ కూడా మాస్ ఎంటర్‌టైనర్ సినిమా అని ముందే చెప్పేశారు కనుక ఈ సినిమాలో ఏముంటుందో మళ్ళీ చెప్పకోనవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా కధ ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే తమిళంలో సూపర్ హిట్ అయిన  వేదాళం (2015) సినిమాను చూడొచ్చు.

ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. భోళాశంకర్‌ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ. భోళాశంకర్‌ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది.