సైకిల్ ఎక్కేసిన కాటమరాయుడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ దీపావళి కానుకగా పవన్ మరో లుక్ ను రివీల్ చేసింది. సైకిల్ పై పంచె కట్టుతో హుశారెత్తించే లుక్ తో వచ్చాడు పవన్ కళ్యాణ్. దసరా బుల్లోడిలా అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ లుక్ సినిమాకే హైలెట్ అవనుంది.

గోపాల గోపాల తర్వాత డాలి డైరక్షన్లో పవన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా షూటింగ్ కు చాలా సార్లు అంతరాయం కలుగడంతో ప్రస్తుతం పవన్ సినిమా కంప్లీట్ చేసేదాకా డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ఇది పూర్తి చేసిన వెంటనే కమిట్ అయిన నేసన్ సినిమాతో పాటుగా త్రివిక్రం సినిమాను కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తాడట పవన్. ఫ్యాక్షన్ నేపథ్యంతో వస్తున్న కాటమరాయుడు సినిమాలో పవన్ లుక్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.