
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా అప్పుడే రెండో సినిమా మొదలుపెట్టాడు. సతీష్ వేగేసన దర్శకత్వంలో చేసిన మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అది విడుదల కాకమునుపే మరో సినిమా మొదలుపెట్టేశాడు.
గీతాగోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, విద్యా కొప్పినిడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో వస్తున ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొత్తగా దిల్‌రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు మారుతి, చందు మొండేటి తదితర సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.
అంజిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంగీతం: రామ్ మిర్యాల, కెమెరా: సమీర్ కళ్యాణి, ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నే చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని దర్శకుడు అంజిబాబు తెలిపారు.