
అల్లు
అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నట్లు హారికా అండ్
హాసినీ క్రియెషన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇప్పటివరకు వారిద్దరి కాంబినేషన్‌లో
వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో మూడు సినిమాలు
సూపర్ డూపర్ హిట్లే. కనుక వారిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారంటే మరో హిట్ గ్యారెంటీ
అని అభిమానులు సంతోషపడుతున్నారు.
ప్రస్తుతం
త్రివిక్రం శ్రీనివాస్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ చేస్తుండగా, అల్లు
అర్జున్ సుకుమార్‌తో పుష్ప-2 చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ త్వరలోనే పూర్తికాబోతున్నాయి.
అయితే అవి పూర్తికాగానే వెంటనే మొదలుపెడతారా లేక కొరటాల శివ,
సందీప్ వంగలతో అల్లు అర్జున్ కమిట్ అయిన రెండు సినిమాలు పూర్తి చేశాక మొదలుపెడతారా?అనేది త్వరలోనే తెలుస్తుంది.
ఈసారి
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చేయబోతున్న సినిమా సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో
ఉంటుందని సమాచారం. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ క్రియెషన్స్ కలిసి నిర్మించబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు
సంబందించి మరిన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.