సింగర్ సునీత కుమారుడి సర్కారీ నౌకరీ

సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అయితే ఆమె కుమారుడు ఆకాష్ గోపరాజు గాయకుడుగా కాకుండా నటుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో భావనా వాళపండల్ జోడీగా ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘సర్కారీ నౌకరి.’

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి లాంఛనంగా షూటింగ్‌ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. దానిలో ఓ చెట్టుకి ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని వ్రాసున్న మెడికల్ బాక్స్, చెట్టు వద్ద సైకిల్ పై కూర్చోన్న మన కొత్త హీరోని పరిచయం చేశారు. ఫస్ట్-లుక్‌ చూస్తే ఇది పీరియాడికల్ మూవీ అని అర్దమవుతోంది. 

విశేషమేమిటంటే ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కె. రాగవేంద్ర రావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, త్రినాథ్, రాజేశ్వరి ముళ్లపూడి, మణిచందన, రమ్య పొందూరి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: శాండిల్య,  దర్శకత్వం, కెమెరా: గంగనమోని శేఖర్.