కీడా కోలా నటుడు హరికాంత్ గుండెపోటుతో మృతి

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొంటున్న యువ నటుడు హరికాంత్ (33) శనివారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. నాటక రంగం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చిన హరికాంత్, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న కీడా కోలా సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేశారు. రెండు రోజుల క్రితమే విడుదలైన కీడా కోలా సినిమా టీజర్‌లో హరికాంత్ కూడా ఉన్నాడు. హరికాంత్ చనిపోయినట్లు వంశీ కాక ట్విట్టర్‌లో తెలియజేశారు. ఇంత చిన్న వయసులో మంచి ప్రతిభా కలిగిన నటుడు హరికాంత్ ఆకస్మిక మరణం పట్ల సినీ పరిశ్రమలో ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.