ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా చేసిన హనుమాన్ సినిమా మే 12న విడుదల చేయాలనుకొన్నారు. అయితే ఆదిపురుష్ కోసం హనుమాన్ వెనక్కు తగ్గాడు. ఆదిపురుష్ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతున్నప్పటికీ ఇప్పుడు దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు కనుక త్వరలోనే హనుమాన్ విడుదల చేస్తారనుకొంటే, జనవరి 12న విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ ట్వీట్ చేశారు.
“ఈ సినిమా కోసం నా జీవితంలో రెండేళ్ళు ఖర్చు చేశాను. ఈ సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మరో ఆరు నెలలు ఖర్చు చేసేందుకు వెనుకాడను. సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 12న హనుమాన్ సినిమా విడుదల చేస్తాము,” అని ట్వీట్ చేస్తూ చేతిలో హనుమంతుడి బొమ్మ ఉన్న ఎర్ర జెండాను పట్టుకొని కొండపై నుంచి మరో కొండపైకి హీరో (తేజా సజ్జా) దూకుతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో హనుమంతుడి దివ్యశక్తులు కలిగిన యువకుడిగా తేజ సజ్జా, అతనికి జోడీగా అమృత అయ్యర్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శర కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్యా, గెట్ అప్ శ్రీను, రాజ్‌భవన్ దీపక్ శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ, మరాఠీ, చైనీస్, కొరియన్, స్పానిష్, జపనీస్ భాషల్లో కలిపి మొత్తం 11 భాషల్లో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం అనుదీప్ దేవ్, ఎడిటింగ్: ఎస్‌బీ రాజు తలారి చేస్తున్నారు.
అయితే జనవరి సంక్రాంతి బరిలో మహేష్ బాబు-త్రివిక్రం శ్రీనివాస్‌ల ‘గుంటూరు కారం’, కమల్‌హాసన్-శంకర్‌ల ‘భారతీయుడు-2’, చిరంజీవి-కళ్యాణ్ కృష్ణల చిత్రం, పవన్ కళ్యాణ్-సుజీత్‌ల ‘ఓజీ’, ప్రభాస్- నాగ్ అశ్విన్‌ల ప్రాజెక్ట్-కె, విజయ్ దేవరకొండ-పరశురామ్‌ల ‘కుషీ’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
కనుక ఒకవేళ జనవరి 12నే హనుమాన్ సినిమా విడుదల చేయాలనుకొంటే థియేటర్లు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా పోటీ వలన నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రశాంత్ వర్మ తన సినిమాను ఇంకా ముందుగా లేదా ఫిభ్రవరి నెలలో విడుదల చేసుకోవలసి రావచ్చు.

I have spent 2 years of my life on this film and ready to spend another 6 months to give you nothing but the best! 🙏🏽#HANUMAN on JAN 12th 2024, SANKRANTHI@tejasajja123 @Niran_Reddy @Primeshowtweets#HanuManForSankranthi pic.twitter.com/YkBBR8TPv0
— Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023