
మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చక్కటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆనంద్ దేవరకొండ ఈసారి ‘బేబీ’ అనే సినిమాతో జూలై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న మాస్ మూవీ మేకర్స్ ఈ విషయం తెలియజేస్తూ విడుదల చేసిన బేబీ రిలీజ్ పోస్టర్ చూసి అందరూ షాక్ అవుతారు.
దానిలో హీరోయిన్ వైష్ణవి చైతన్యను మిడిల్ ఫింగర్ అన్నట్లు చూపారు. అయితే అది వివాదస్పదమవుతుందని అనుమానం కలగడంతో వెంటనే దానిని తొలగించి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అది కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. హీరోయిన్ పెదాలతో షేవింగ్ బ్లేడ్ పట్టుకొని ఉండగా ఆమె ఎదురుగా హీరో మీసాలు, గడ్డాని చూపారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో?
రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బేబీ’ని ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్‌లతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తీశారు. ఈ సినిమాలో సీత, నాగబాబు, పృధ్వీ, లిరిష, సాత్విక్ ఆనంద్, కుసుమ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్ చేశారు. ఈ సినిమాను ఎస్‌కెఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై శ్రీనివాస్ కుమార్ నిర్మిస్తున్నారు.