
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పడుకొనే జోడీగా 2024, జనవరి 12న వస్తున్న ప్రాజెక్ట్-కెలో యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ కూడా నటించబోతున్నారు. ఆయనకు స్వాగతం చెపుతూ ఎవరేమన్నారంటే...
అమితాబ్ బచ్చన్: స్వాగతం కమల్‌హాసన్... మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మీతో కలిసి పనిచేయబోతునందుకు సంతోషిస్తున్నాను.
ప్రభాస్: ఈ క్షణం నా మనసులో ముద్రపడి ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రాజెక్ట్-కె సినిమాలో లిజండరీ కమల్‌హాసన్ సర్‌తో కలిసి పనిచేయడం ఎంత గొప్ప గౌరవమో మాటలలో వివరించలేను. సినీ పరిశ్రమలో అటువంటి గొప్ప నటుడితో కలిసి పనిచేస్తూ అనేక విషయాలు నేర్చుకొని ఎదగాలనే నా కల ఇప్పటికీ నెరవేరింది.
నిర్మాత అశ్వినీ దత్: కమల్‌హాసన్‌తో కలిసి పనిచేయాలనే నా కల ఇన్నాళ్ళకు నెరవేరింది. నా సినీ ప్రస్థానంలో 50 సంవత్సరంలో నాకు ఈ అవకాశం లభించడం వరంగా భావిస్తున్నాను.
దర్శకుడు నాగ్ అశ్విన్: అనేక పాత్రలలో నటించిన కమల్‌హాసన్ సర్ మా ఈ సినిమాలో మరో సరికొత్త పాత్ర చేయడానికి అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నాను.
కమల్‌హాసన్: 50 ఏళ్ళ క్రితం నేను డ్యాన్స్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడే సినీ నిర్మాణ రంగంలో అశ్వినీదత్ ఎంతో ఉన్నతస్థాయిలో ఉండేవారు. 50 ఏళ్ళ తర్వాత మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నాము. కొత్త తరానికి చెందిన ఓ గొప్ప దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ తరానికి చెందిన ప్రభాస్, దీపికా పడుకొనేలతో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాను.
ఇదివరకు అమిత్ జీతో కలిసి నటించాను. ఆయనతో నటించిన ప్రతీసారి మొదటిసారి నటించినట్లు అనిపిస్తుంటుంది. ఆయన ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొంటూ ఉంటారు. నేనూ అటువంటి ప్రయత్నాలే చేస్తుంటాను. ప్రాజెక్ట్-కె సినిమాలో నాకు లభించిన పాత్రతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తాను. నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
ప్రాజెక్ట్-కె సినిమాలో ప్రభాస్, దీపికా పడుకొనే, బిగ్-బి అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే జనవరి 12న విడుదలకాబోతోంది.