
అవును... నాగ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెకుతున్న ప్రాజెక్ట్-కెలో యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ నటించబోతున్నారు. ఈ విషయం ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ స్వయంగా నిన్న సోషల్ మీడియాలో ప్రకటించింది.
“ఈ ప్రపంచమంతటిపై ఎవరి ఛాయ వ్యాపించి ఉందో అటువంటివారు మాకు అవసరం. అటువంటివారు ఒక్కరే ఉన్నారు. వారే ఉలగ నాయగన్ కమల్‌హాసన్,”అంటూ ప్రకటించింది.
ప్రాజెక్ట్-కె సినిమాలో ప్రభాస్, దీపికా పడుకొనే, బిగ్-బి అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే జనవరి 12న విడుదలకాబోతోంది.