యువనటుడు శ్రీవిష్ణు, రెబ మోనికాజాన్ జంటగా నటించిన ‘సామజవరగమన’ చిత్రం ఈనెల 29న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను మంచి రొమాంటిక్, కామెడీగా తెరకెక్కించామని దర్శకుడు రామ్ అబ్బరాజు తెలిపారు.
ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, బాలాజీ గుప్తా నిర్మించారు. ఈ సినిమాను కధ: భోగవరపు భాను, డైలాగ్స్: నందు సవిరిగన, కెమెరా: రామ్ చరణ్ రెడ్డి, సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేశారు.
కొద్ది సేపటి క్రితమే ఈ సినిమాలో హోలరే హోల పాట లిరికల్ వీడియో విడుదలచేశారు.