ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (55) మృతి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌, గాంధీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఇటీవల విజయనగరంలో ఓ సినిమా షూటింగ్‌కు హాజరై హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తర్వాత రక్తవిరోచనాలు అవుతుండటం కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు.

అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. డయాబెటీస్ కారణంగా ఆయన అంతర్గత అవయవాలు పనిచేయడం మానేశాయి. ఆయనను కాపాడేందుకు వైద్యులు చాలా ప్రయత్నించారు. కానీ కాపాడలేకపోయారు. విజయనగరంలో ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు రాకేశ్ మాస్టార్ అక్కడ యూనిట్ సభ్యులతో పోటీ పడి అతిగా మద్యం తాగిన్నట్లు తెలుస్తోంది. బహుశః అదే ఆయన ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెట్టి ఉండవచ్చు. 

రాకేశ్ మాస్టార్ అసలు పేరు ఎస్.రామారావు. 1968లో తిరుపతిలో జన్మించారు. టాలీవుడ్‌లో చిర్నవ్వుతో, లాహిరిలాహిరిలో, దేవదాసు, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు తదితర 1,500కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. అనేక సినిమాలు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి అనేకమందికి ఆయనే శిష్యులే. 

తల్లి, తండ్రి, తమ్ముడు, ఇక పలు ఆత్మీయుల చావులను చూసిన రాకేశ్ మాస్టర్ తనకు జీవితం మీద విరక్తి కలిగిందని, ఎంత సంపాదించినా, ఆయుషును కొనుక్కోలేమని కనుక తాను చనిపోయిన తర్వాత తన మామగారి సమాధి పక్కనే తననూ సమాధి చేయాలని ముందే చెప్పారు. తన అంతిమయాత్రను కూడా రాకేశ్ మాస్టర్ ఏవిదంగా సాగాలో ముందే షూట్ చేసుకొన్నారు. రాకేశ్ మాస్టర్ మృతిపట్ల టాలీవుడ్‌లో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.