2.jpg)
ఆదిపురుష్ సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, ఆ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు క్రెయియే చేసిన హైప్, ప్రభాస్ ఇమాజ్ కారణంగా అమెరికాలో తొలిరోజే ఒక మిలియన్ డాలర్లు (రూ.8.20 కోట్లు)కు మించి వసూలు చేసిన్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో ప్రకటించింది. నేడు రేపు శని, ఆదివారాలు కనుక మరో 2-3 మిలియన్ డాలర్లు అవలీలగా వసూలు చేయవచ్చు. అమెరికా, యూకే తదితర దేశాలలో సుమారు 3000 థియేటర్లలో సినిమాను విడుదల చేసినందున కలక్షన్స్ భారీగానే ఉండవచ్చు. ఇక భారత్‌లో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, పైన పేర్కొన్న కారణాల వల్లనే భారీగా కలక్షన్స్ సాధించడం ఖాయమే. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ తొలిరోజే రూ.100 కోట్లు కలక్షన్స్ సాధించిన్నట్లు తెలుస్తోంది. తొలిరోజేరూ.100 కోట్లు కలక్షన్స్ సాధించి, బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఫ్-2, పఠాన్ సినిమాల సరసన ఆదిపురుష్ కూడా నిలిచింది. సినిమా ఏవిదంగా ఉన్నప్పటికీ నిర్మాతలకు ఆదిపురుష్ భారీగా లాభాలు ఆర్జించపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన తొలిరోజునే దాని ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకొన్నట్లు వెల్లడైంది. అయితే ఇది ఓటీటీలో రావడానికి మరో నెల లేదా రెండు నెలలు సమయం పట్టవచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో ఆదిపురుష్ ఎప్పుడు విడుదలైనా అన్ని భాషలలో ఒకేసారి ప్రసారం కాబోతోంది.