1.jpg)
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, ప్రభాస్ అభిమానులే కాకుండా యావత్ దేశంలో ప్రజలు, సినీ అభిమానులు ఆదిపురుష్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
వెంకీ రివ్యూస్ ట్విట్టర్లో పేర్కొన ప్రకారం రామాయణాన్ని మళ్ళీ చెపుతున్న ఆదిపురుష్ సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు బాగుందని, ఇంటర్వెల్ తర్వాత చప్పగా చాలా బోరింగ్‌గా సాగిందట. ఫస్ట్ హాఫ్‌లో డ్రామా బాగుందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ వరకు సాగదీసిన్నట్లు అనిపించిందని పేర్కొన్నారు. వీఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేదని తెలిపింది. అయితే సినిమాలో సంగీతం అద్భుతంగా ఉందని అదే సినిమాను కాపాడవచ్చని అన్నారు. మొత్తం మీద ఆశించినంత గొప్పగా లేదని వెంకీ రివ్యూస్ పేర్కొంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇచ్చింది.
అంతకు ముందు పెట్టిన మరో ట్వీట్ రివ్యూలో, “శ్రీరాముడుగా ప్రభాస్ అద్భుతంగా నటించాడు కానీ ఈ సినిమాలో మిగిలిన అనేక పాత్రల కారణంగా ఆయనకు ఎక్కువ స్క్రీన్ టైమ్ లభించలేదు. రావణుడుగా సైఫ్ ఆలీఖాన్ బాగా చేశాడు. కానీ ఆయన పాత్రని కాస్త ఎబ్బెట్టుగా రూపొందించారు. సీతాదేవిగా కృతి సనన్ బాగానే నటించింది కానీ ఆమె పాత్ర కూడా చాలా పరిమితంగానే ఉంది ఈ సినిమాలో,” అని పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలలో కూడా ఆదిపురుష్ విడుదలైంది. కనుక మరికొన్ని గంటలలో ఈ సినిమా పూర్తి రివ్యూ రాబోతోంది.